ఎఫ్‌-1 డ్రైవర్‌ పెరెజ్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-08-01T08:49:17+05:30 IST

ఫార్ములా వన్‌ డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. దాంతో ఆదివారం జరిగే బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ రేస్‌ నుంచి అతడు వైదొలిగాడు...

ఎఫ్‌-1 డ్రైవర్‌ పెరెజ్‌కు కరోనా

లండన్‌: ఫార్ములా వన్‌ డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. దాంతో ఆదివారం జరిగే బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ రేస్‌ నుంచి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని పెరెజ్‌ జట్టు ‘రేసింగ్‌ పాయింట్‌’ శుక్రవారం వెల్లడించింది. మెక్సికోకు చెందిన 30 ఏళ్ల పెరెజ్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించింది. ఇక..ఆదివారం జరిగే రేస్‌కు సెర్గియో స్థానంలో జర్మనీకి చెందిన నికో హల్కెన్‌బర్గ్‌ బరిలోకి దిగనున్నాడు. 

Updated Date - 2020-08-01T08:49:17+05:30 IST