ఇది మనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిది

ABN , First Publish Date - 2020-05-10T10:23:05+05:30 IST

కరోనా వైర్‌సతో పోరాటాన్ని మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌తో పోల్చాడు. ‘ఈ మహమ్మారిని ...

ఇది మనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిది

బెంగళూరు: కరోనా వైర్‌సతో పోరాటాన్ని మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌తో పోల్చాడు. ‘ఈ మహమ్మారిని ఎదుర్కోవాలనుకుంటే మనమంతా కలిసికట్టుగా పోరాడాల్సిందే. ఇది ఒక టెస్టు మ్యాచ్‌లాంటిది. క్రికెట్‌లో ఈ ఫార్మాట్‌ ఐదు రోజుల పాటు సాగుతుంది. అందులో రెండు ఇన్నింగ్స్‌లే ఉంటాయి. కానీ కరోనాతో పోరు సుదీర్ఘం కాలం సాగేది కాబట్టి ఇక్కడ అలాంటి ఇన్నింగ్స్‌లు చాలానే ఉంటాయి. అందుకే ఇప్పుడేదో మనం స్వల్ప ఆధిక్యం సాధించామని ఉత్సాహపడవద్దు. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌ కఠినంగా ఉండగలదు. ఇక్కడ మనం గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సరిపోదు. పూర్తి ఏకపక్ష విజయం సాధించాల్సిందే’ అని కుంబ్లే  ట్విటర్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు.

Updated Date - 2020-05-10T10:23:05+05:30 IST