ఆ ఇద్దరు.. అత్యుత్తమ టీ20 ఓపెనర్లు

ABN , First Publish Date - 2020-04-05T09:59:49+05:30 IST

రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ అత్యుత్తమ టీ20 ఓపెనర్లుగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ పేర్కొన్నాడు...

ఆ ఇద్దరు.. అత్యుత్తమ టీ20 ఓపెనర్లు

న్యూఢిల్లీ: రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ అత్యుత్తమ టీ20 ఓపెనర్లుగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ పేర్కొన్నాడు. ప్రముఖ కోచ్‌గా, వ్యాఖ్యాతగా పేరుపొందిన మూడీ.. ట్విటర్‌ వేదికగా క్రికెట్‌ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన ప్రపంచ అత్యుత్తమ టీ20 ఓపెనర్లు ఎవరో చెప్పాలని నెటిజన్లు టామ్‌ను అడిగారు. ‘రోహిత్‌, వార్నర్‌ ఓపెనర్లుగా ఉంటే ఎంతో సంతోషిస్తా’ అని బదులిచ్చాడు. కోహ్లీని తన ఫేవరెట్‌ భారత క్రికెటర్‌గా పేర్కొన్న మూడీ.. అభిమాన ఐపీఎల్‌ జట్టు చెన్నై, ఫేవరెట్‌ కెప్టెన్‌ ధోనీ అని తెలిపాడు. 

Updated Date - 2020-04-05T09:59:49+05:30 IST