మాజీ ఫుట్‌బాలర్‌ వీరుబాబు మృతి

ABN , First Publish Date - 2020-09-06T09:15:49+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ వి.వీరుబాబు (63) అనారోగ్యంతో శనివారం కన్నుమూశాడు. ఆయన స్వస్థలం

మాజీ ఫుట్‌బాలర్‌ వీరుబాబు మృతి

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ వి.వీరుబాబు (63) అనారోగ్యంతో శనివారం కన్నుమూశాడు. ఆయన స్వస్థలం విశాఖపట్నం. సెంటర్‌ ఫార్వర్డ్‌ ఆటగాడైన వీరు 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత బెంగాల్‌-నాగపూర్‌ రైల్వే డివిజన్‌, భారత రైల్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత రైల్వే తరఫున సంతోష్‌ ట్రోఫీలో, రోవర్స్‌ కప్‌, స్టీల్‌ కప్‌, డ్యురాండ్‌ కప్‌ టోర్నీల్లో ఆడాడు. 1981లో జరిగిన వరల్డ్‌ రైల్వే ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో తలపడిన భారత జట్టుకు వీరుబాబు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరుబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొసరాజు గోపాల్‌కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-06T09:15:49+05:30 IST