అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా కన్నుమూత
ABN , First Publish Date - 2020-11-26T04:25:18+05:30 IST
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు. 60 సంవత్సరాల మారడోనా మెదడులో
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు. 60 సంవత్సరాల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే చికిత్స చేయించుకున్నారు. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986లో అర్జెంటైనాకు ప్రపంచ కప్ అందించారు. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.