కరోనాతో ఇరాక్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మృతి

ABN , First Publish Date - 2020-06-22T09:33:51+05:30 IST

కరోనా వైరస్‌తో ఇరాక్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం అహ్మద్‌ రాది (56) ఆదివారం మృతి చెందాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అహ్మద్‌ గతవారం బాగ్దాద్‌లోని ఒక

కరోనాతో ఇరాక్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మృతి

బాగ్దాద్‌: కరోనా వైరస్‌తో ఇరాక్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం అహ్మద్‌ రాది (56) ఆదివారం మృతి చెందాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అహ్మద్‌ గతవారం బాగ్దాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అయితే రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడిన అహ్మద్‌ ఆదివారం ఉదయం కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. స్ట్రయికర్‌ రాది సారథ్యంలోని ఇరాక్‌ 1984, 1988 గల్ఫ్‌కప్‌ టోర్నీల్లో విజేతగా నిలిచింది. ఇక 1986 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో బెల్జియంపై రాది ఏకైక గోల్‌ చేశాడు. 

Updated Date - 2020-06-22T09:33:51+05:30 IST