‘లా లిగా’ ప్లేయర్ గారేకు కరోనా
ABN , First Publish Date - 2020-03-16T10:35:48+05:30 IST
ప్రఖ్యాత ఫుట్‌బాల్ లీగ్ ‘లా లిగా’కు కరోనా సెగ తగిలింది. ఆ లీగ్‌లో ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎజెక్విల్ గారే (33)కు కరోనా సోకింది
మాడ్రిడ్: ప్రఖ్యాత ఫుట్‌బాల్ లీగ్ ‘లా లిగా’కు కరోనా సెగ తగిలింది. ఆ లీగ్‌లో ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎజెక్విల్ గారే (33)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్‌లో ఇప్పటివరకు 6,391 కరోనా కేసులు నమోదవగా.. అందులో 196 మంది ప్రాణాలు కోల్పోయారు.