‘టాప్స్‌’ కోర్‌ నుంచి నిఖత్‌కు ఉద్వాసన

ABN , First Publish Date - 2020-12-01T09:44:29+05:30 IST

తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) కోర్‌ గ్రూపు నుంచి తప్పించారు.

‘టాప్స్‌’ కోర్‌ నుంచి నిఖత్‌కు ఉద్వాసన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) కోర్‌ గ్రూపు నుంచి తప్పించారు. మహిళల 51 కిలోల విభాగంలోని నిఖత్‌తో పాటు శివ థాపా (63 కిలోలు)ను కూడా కోర్‌ నుంచి డెవల్‌పమెంట్‌ గ్రూపునకు మార్చారు. ‘టాప్స్‌’లో చోటు లభించిన బాక్సర్ల జాబితాను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సోమవారం విడుదల చేసింది. సిమ్రన్‌జీత్‌ కౌర్‌, పూజారాణికి మేరీకోమ్‌తో పాటు ఎలైట్‌ గ్రూపులో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌ పతక రేసులో ఉన్న అమిత్‌ పంఘల్‌, మనీష్‌ కౌశిక్‌, వికాస్‌ కృష్ణన్‌తో పాటు ఆశీష్‌, సతీష్‌, లవ్లీనా, కవీందర్‌ సింగ్‌కు కోర్‌ గ్రూపులో చోటు దక్కింది.

Updated Date - 2020-12-01T09:44:29+05:30 IST