ఆ సమయంలో నన్ను ఓ నేరస్తుడిలా చూశారు: యువరాజ్
ABN , First Publish Date - 2020-05-14T01:28:59+05:30 IST
2014 టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా అద్భుత ప్రదర్శన చేసినా.. తృటిలో టైటిల్ కోల్పోయింది. టోర్నీలో మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన

న్యూఢిల్లీ: 2014 టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా అద్భుత ప్రదర్శన చేసినా.. తృటిలో టైటిల్ కోల్పోయింది. టోర్నీలో మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ధోనీసేన.. టైటిల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడినా.. యువరాజ్ సింగ్ ధాటిగా ఆడలేకపోవడంతో భారత్ ఓడిపోయింది.
ఫైనల్ మ్యాచ్‌లో 21 బంతులు ఎదురుకొని కేవలం 11 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ ఓటమికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో యూవీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ రోజు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఫైనల్ మ్యాచ్ తర్వాత చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. నేను ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాక.. నా చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఒక నేరస్తుడిలా చూశారు. నా ఇంటి మీద రాళ్లతో కూడా దాడి చేశారు. ఆ క్షణం నాకు నేను అభిమానుల ఆశను మోసం చేపిన నేరస్తుడిలా కనిపించాను. నా జీవితాంతం ఆ సంఘటన గుర్తుండిపోతుంది’’ అని యువరాజ్ పేర్కొన్నాడు.