ముగిసిన మూడో రోజు ఆట.. నెమ్మదిగా, నిలకడగా ఆడుతున్న విండీస్

ABN , First Publish Date - 2020-07-11T02:27:02+05:30 IST

కరోనా కాలంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్

ముగిసిన మూడో రోజు ఆట.. నెమ్మదిగా, నిలకడగా ఆడుతున్న విండీస్

సౌతాంప్టన్: కరోనా కాలంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 57/1తో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్‌ కంటే 31 పరుగుల ఆధిక్యం సంపాదించింది. 43 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ మూడో రోజు నిలకడగా ఆడింది. కరీబియన్ బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు పేర్చుకుంటూ పోయారు. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ అర్ధ సెంచరీ (65)తో ఆకట్టుకోగా, కాంప్‌బెల్ 28, బ్రూక్స్ 39 పరుగులు చేశారు.


హోప్ (16), బ్లాక్‌వుడ్ (12) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి ఇంగ్లండ్ కంటే 31 పరుగులు ఆధిక్యం సాధించింది. రోస్టన్ చేజ్ (12), షేన్ డౌరిచ్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, డొమినిక్ బెస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బెన్ స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌట్ అయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా పూర్తి బయోసెక్యూర్ వాతావరణం మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

Updated Date - 2020-07-11T02:27:02+05:30 IST