స్టోక్స్ కూడా కోహ్లీలానే.. : నాసిర్ హుస్సేన్

ABN , First Publish Date - 2020-07-05T23:17:09+05:30 IST

విరాట్‌ కోహ్లీ, బెన్ స్టోక్స్ ఒకేలాంటి వారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ప్రస్తుతం విండీస్‌తో...

స్టోక్స్ కూడా కోహ్లీలానే.. : నాసిర్ హుస్సేన్

లండన్: విరాట్‌ కోహ్లీ, బెన్ స్టోక్స్ ఒకేలాంటి వారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ప్రస్తుతం విండీస్‌తో జరగనున్న తొలి టెస్టుకు స్టోక్స్ కెప్టెన్సీ వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసిర్ స్టోక్స్‌కు అండగా నిలిచాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాసిర్ ఆల్‌రౌండర్ స్టోక్స్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. అతడు మంచి ఆటగాడని, కెప్టెన్‌గా కూడా చక్కగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జో రూట్ గైర్హాజరవడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేజిక్కంచుకున్న స్టోక్స్ అవకాశాన్ని సద్వినియోగం చేకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.


‘స్టోక్స్ కూడా కోహ్లీలానే ప్రతి విషయంపై తీవ్రంగా ఆలోచిస్తాడు. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు. కెప్టెన్సీకి అతడు అర్హుడు. బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. స్టోక్స్ కూడా రూట్‌ మాదిరిగానే జట్టుకోసం ఎంతగానో కష్టపడతాడని, జవాబుదారీగా ఉంటాడని నాసిర్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-07-05T23:17:09+05:30 IST