ఇంగ్లండ్‌ క్రికెటర్ల వితరణ

ABN , First Publish Date - 2020-04-05T09:50:21+05:30 IST

ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆ దేశ పురుషుల, మహిళా క్రికెటర్లు ముందుకు వచ్చారు. దీంట్లో భాగంగా తమ మూడు నెలల ...

ఇంగ్లండ్‌ క్రికెటర్ల వితరణ

లండన్‌: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆ దేశ పురుషుల, మహిళా క్రికెటర్లు ముందుకు వచ్చారు. దీంట్లో భాగంగా తమ మూడు నెలల వేతనాల్లో 20 శాతం కోత విధించుకోనున్నారు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇటీవల చేసిన ఈ ప్రతిపాదనకు ఆటగాళ్లు అంగీకరించారు. ఇక పురుషుల జట్టుకు సంబంధించి ఈ మొత్తం 5 లక్షల పౌండ్ల (రూ.4 కోట్ల 69 లక్షలు) కానుంది. ‘ఇంగ్లండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లతో జరిగిన సమావేశం తర్వాత వారంతా 0.5 మిలియన్‌ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు’ అని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పురుషుల, మహిళల క్రికెటర్ల ఏప్రిల్‌, మే, జూన్‌ వేతనాల్లో కోత పడనుంది.  

Updated Date - 2020-04-05T09:50:21+05:30 IST