ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
ABN , First Publish Date - 2020-12-03T09:47:30+05:30 IST
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను పర్యాటక ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్లతో గెలిచి.. 3-0తో సిరీస్ కైవసం చేసుకొంది. గత ఎనిమిది ..

మూడో టీ20లోనూ సఫారీలపై గెలుపు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను పర్యాటక ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్లతో గెలిచి.. 3-0తో సిరీస్ కైవసం చేసుకొంది. గత ఎనిమిది సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇది ఏడో విజయం కావడం విశేషం. చివరిసారి 2018లో భారత్ చేతిలో మాత్రమే ఇంగ్లిష్ టీమ్ సిరీస్ ఓడింది. కాగా, తొలుత డుస్సెన్ (74 నాటౌట్), ఫా డుప్లెసి (52 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారీ ఛేదనలో డేవిడ్ మలాన్ (99 నాటౌట్), జోస్ బట్లర్ (67 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో 192/1 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. మలాన్-బట్లర్ రెండో వికెట్‌కు ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20ల్లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. మలాన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.