ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌.. నో మిక్స్‌డ్‌ డబుల్స్‌

ABN , First Publish Date - 2020-06-18T07:35:20+05:30 IST

ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. అవేంటంటే..

ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌.. నో మిక్స్‌డ్‌ డబుల్స్‌

వాషింగ్టన్‌: ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. అవేంటంటే..

  • మ్యాచ్‌లో లైన్‌ అంపైర్ల స్థానంలో ఎలకా్ట్రనిక్‌ లైన్‌ కాలింగ్‌ను ప్రవేశపెడుతున్నారు. బంతి లైన్‌ లోపల పడిందా.. వెలుపల పడిందా అన్నదాన్ని ఎలకా్ట్రనిక్‌ లైన్‌ కాలింగ్‌ పద్ధతిలో గుర్తించనున్నారు. 
  • ఈసారి మిక్స్‌డ్‌ డబుల్స్‌, జూనియర్స్‌, వీల్‌చైర్స్‌ విభాగాల్లో మ్యాచ్‌లు జరగవు. 
  • క్వాలిఫయింగ్‌ రౌండ్లు రద్దు చేశారు. పురుషులు, మహిళల డబుల్స్‌ విభాగాల్లో జోడీలను 64 నుంచి 32కు కుదించారు. పురుషులు, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో 128 మంది చొప్పున కాకుండా 120 మంది ప్లేయర్లను మాత్రమే ఆడిస్తారు. వారి ర్యాంకుల ప్రకారం నేరుగా మెయిన్‌ డ్రాకు అనుమతిస్తారు.
  • హోటల్‌లో ఒక ప్లేయర్‌ వెంట ఉండేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి. ఆ నలుగురు   రెండు గదుల్లో ఉండొచ్చు. ఒక గదికి మాత్రమే యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు అద్దె చెల్లిస్తారు. మరో గది అద్దె ఖర్చులను సదరు ప్లేయరే భరించాలి.

Updated Date - 2020-06-18T07:35:20+05:30 IST