డొనాల్డ్ ట్రంప్‌నకు బాబా సెహ్వాగ్ ఆశీర్వాదం!
ABN , First Publish Date - 2020-10-03T09:03:44+05:30 IST
కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు, సెలెబ్రిటీలు సందేశాలు
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు, సెలెబ్రిటీలు సందేశాలు పంపుతున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. బాబా అవతారంలో ఉన్న ఫొటోతో..‘ట్రంప్ కొవిడ్ నుంచి కోలుకోవాలని బాబా సెహ్వాగ్ ఆశీర్వదిస్తున్నాడు. గో..కరొనా..గో..కరొనా గో’ అని ట్వీట్ చేశాడు.