సెహ్వాగ్ కాదు.. అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది ఎవరో తెలుసా?
ABN , First Publish Date - 2020-05-18T23:32:47+05:30 IST
వీరేంద్ర సెహ్వాగ్ ఆ కాలంలో విధ్వంసకర ఆటగాడు. ఫార్మాట్ ఏదైనా సరే.. మొదటి బంతి నుంచే అతను బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. వన్డేల్లో అత్యంత వేగంగా

వీరేంద్ర సెహ్వాగ్ ఆ కాలంలో విధ్వంసకర ఆటగాడు. ఫార్మాట్ ఏదైనా సరే.. మొదటి బంతి నుంచే అతను బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసి రికార్డు సృష్టించిన సెహ్వాగ్.. టెస్టుల్లో మాత్రం ఆ ఘనత సాధించలేకపోయాడు. తన కెరీర్‌లో 82.83 స్ట్రైక్‌రేటుతో 8,586 పరుగులు చేసిన అతను అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసి ఆటగాళ్ల లిస్టులో మాత్రం రెండో స్థానంలో ఉన్నాడు.
భారత ఆటగాళ్లలో అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసిన లిస్ట్‌లో కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా మొదటిస్థానంలో ఉన్నారు. వీరిద్దరు 74 బంతుల్లో టెస్టుల్లో సెంచరీలు చేశారు. అయితే ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉంది. 54 బంతుల్లో సెంచరీ చేసిన అతను సార్ వీవ్ రిచర్డ్స్, మిస్బా ఉల్ హక్‌ల రికార్డును బద్దలుకొట్టాడు.