మా వాడిని నిందిస్తారెందుకు?
ABN , First Publish Date - 2020-06-25T09:02:30+05:30 IST
ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న టాప్ ఆటగాళ్లు దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కోరిచ్ (క్రొయేషియా) కరోనా బారిన పడడంతో ఈవెంట్ ...

జొకోవిచ్‌కు తల్లిదండ్రుల మద్దతు
బెల్‌గ్రేడ్: ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న టాప్ ఆటగాళ్లు దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కోరిచ్ (క్రొయేషియా) కరోనా బారిన పడడంతో ఈవెంట్ నిర్వాహకుడు జొకోవిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్‌ల సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా ఆటగాళ్లకు వైరస్ సోకడంలో జొకో పరోక్షంగా కారకుడయ్యాడంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో నొవాక్‌ను అతని తల్లిదండ్రులు వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. ఈ వైరస్ వ్యాప్తికి అసలు కారకుడంటూ దిమిత్రోవ్‌పై నిందలేస్తున్నారు. ‘ఇది ఎందుకు జరిగింది? అతను (దిమిత్రోవ్) టోర్నీకి అనారోగ్యంతోనే వచ్చాడు. అతను ఎక్కడ వైర్‌సను తగిలించుకున్నాడో ఎవరికి తెలుసు?’ అని నొవాక్ తండ్రి జాన్ జొకోవిచ్ అన్నాడు. కరోనా బారిన పడ్డ తమ అబ్బాయి, కోడలు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారనీ.. కానీ ఈ విమర్శలే వాళ్లను బాధిస్తున్నాయని జొకో తల్లి డయానా వ్యాఖ్యానించింది.