ఇరాన్‌ ఒలింపిక్‌ విజేతకు కరోనా

ABN , First Publish Date - 2020-03-30T09:51:15+05:30 IST

ఇరాన్‌కు చెందిన ఒలింపిక్‌ రజత పతక విజేత, డిస్కస్‌ త్రోయర్‌ ఎహ్‌సాన్‌ హదాదికి కరోనా వైరస్‌ సోకింది. ‘ఎహ్‌సాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వీయ ...

ఇరాన్‌ ఒలింపిక్‌ విజేతకు కరోనా

టెహ్రాన్‌: ఇరాన్‌కు చెందిన ఒలింపిక్‌ రజత పతక విజేత, డిస్కస్‌ త్రోయర్‌ ఎహ్‌సాన్‌ హదాదికి కరోనా వైరస్‌ సోకింది. ‘ఎహ్‌సాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వీయ నిర్బంధంలో ఉన్న అతనికి చికిత్స కొనసాగుతోంది’ అని ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య, ఇరాన్‌ వార్తా సంస్థ ప్రకటించాయి. 35 ఏళ్ల ఎహ్‌సాన్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఇరాన్‌ తరఫున ఒలింపిక్‌ పతకం నెగ్గిన ఏకైక అథ్లెట్‌ ఎహ్‌సాన్‌. 

Updated Date - 2020-03-30T09:51:15+05:30 IST