టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
ABN , First Publish Date - 2020-10-20T00:49:38+05:30 IST
రాజస్థాన్ రాయల్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెరో 9 మ్యాచ్‌లు ఆడి

అబుదాబి: రాజస్థాన్ రాయల్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెరో 9 మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి ఆరేసి పాయింట్లతో ఉన్న ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇక నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో నేటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. చెన్నై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయం నుంచి బ్రావో ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హాజిల్‌వుడ్‌ను తీసుకోగా, కర్న్ శర్మ స్థానంలో చావ్లా జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ జట్టులో ఒకే ఒక్క మార్పు కనిపించింది. ఉనద్కత్ స్థానంలో రాజ్పుట్ జట్టులోకి వచ్చాడు.