ప్రధాని లేఖకు ధోని రిప్లై

ABN , First Publish Date - 2020-08-20T20:56:46+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ అతడికి..

ప్రధాని లేఖకు ధోని రిప్లై

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ అతడికి ఓ లేఖ రాశారు. ఈ లేఖపై ధోనీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ప్రధాని తనకు రాసిన లేఖను ఆ ట్వీట్‌కు జతచేశాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే. మేము పడిన కష్టం, చేసిన త్యాగాలను ఎదుటివారు గుర్తించారనే ఆలోచనే ఎంతో సంతోషాన్నిస్తుంది. నన్ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీ మీకు ధన్యవాదాలు’ అంటూ ధోనీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ప్రధాని తన లేఖలో ధోనీని గొప్పగా కీర్తించారు. యువతకు ధోనీ ఎంతో స్పూర్తిగా నిలిచాడని, అతడో గొప్ప మార్గదర్శకుడని మోదీ అభినందించారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే తత్వం ధోనీ సొంతమని, రిటైర్మెంట్ తరువాత కూడా అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిని అన్నారు. ఉత్తమ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ధోనీకి సాటిలేరని కొనియాడారు.Updated Date - 2020-08-20T20:56:46+05:30 IST