ధోనీకి రిటైరయ్యే ఆలోచనే లేదు!

ABN , First Publish Date - 2020-07-10T07:27:25+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని అతని మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో బరిలోకి దిగడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడని తెలిపాడు. ధోనీ

ధోనీకి రిటైరయ్యే ఆలోచనే లేదు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని అతని మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో బరిలోకి దిగడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడని తెలిపాడు. ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడంటూ చాలారోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ధోనీ మేనేజర్‌ వీటికి తెరపడేలా స్పష్టతనిచ్చాడు. ‘మేమిద్దరం స్నేహితులం కాబట్టి కాబట్టి క్రికెట్‌ గురించి పెద్దగా మాట్లాడుకోం. కానీ, ధోనీని దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం చెబుతున్నా.. తనకు రిటైర్మెంట్‌ గురించిన ఆలోచనే ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఐపీఎల్‌ ఆడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. అందుకోసం ముందుగానే ప్రాక్టీస్‌ ఆరంభించాడు. కానీ, వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో క్యాంప్‌ రద్దయింద’ని దివాకర్‌ అన్నాడు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన వెంటనే మహీ ప్రాక్టీస్‌ మొదలెడతాడని చెప్పాడు.

Updated Date - 2020-07-10T07:27:25+05:30 IST