ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా ధోనీ

ABN , First Publish Date - 2020-10-03T23:18:49+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఒక్క డకౌట్ కూడా కాకుండా వరుసగా 100 టీ20

ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా ధోనీ

అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఒక్క డకౌట్ కూడా కాకుండా వరుసగా 100 టీ20 ఇన్నింగ్స్ ఆడిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2015లో ధోనీ చివరిసారి డకౌట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ డౌకౌట్ కాలేదు. ఓవరాల్‌గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్ ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. టీ20ల్లో ఒక్క డకౌట్ కూడా లేకుండా ఏకంగా 145 ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, నిన్న అబుదాబిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ సేన ఓటమి పాలైంది. 


ఇక, డకౌట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన ఓవరాల్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ తర్వాత శ్రీలంక ఆటగాడు దినేశ్ చండీమల్ ఉన్నాడు. చండీమల్ 2009 నుంచి ఇప్పటి వరకు డకౌట్ కాలేదు. మొత్తం 106 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆసీస్ ఆటగాడు షాన్ మార్స్(102‌), దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమినీ (101) మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ధోనీ ఐదో స్థానంతో వారి సరసన చేరాడు. 

Updated Date - 2020-10-03T23:18:49+05:30 IST