రోలర్నూ నడిపిస్తా: ధోనీ
ABN , First Publish Date - 2020-02-28T09:54:29+05:30 IST
వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ.. ఐపీఎల్ సమీపిస్తుండడంతో రాంచీ క్రికెట్ స్టేడియంలో సాధన చేస్తున్నాడు.
రాంచీ: వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ.. ఐపీఎల్ సమీపిస్తుండడంతో రాంచీ క్రికెట్ స్టేడియంలో సాధన చేస్తున్నాడు. ఈ సందర్భంగా అత డు పిచ్‌ను మరమ్మతు చేసే పని లో పడ్డాడు. దీనికోసం ధోనీ ఏకం గా రోలర్ డ్రైవర్‌గా మారి సీరియస్‌గా పిచ్‌ను చదును చేస్తూ కనిపించాడు. మరోవైపు ధోనీ సేంద్రీయ వ్యవసాయంలోనూ అడుగుపెట్టాడు. ‘ప్రస్తుతం పుచ్చకాయల సాగును ప్రారంభిస్తున్నా. మరో 20 రోజుల్లో బొప్పాయిని సాగు మొదలుపెడతా’నంటూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశాడు.