‘టీ20 కా కింగ్‌’ ధోనీ

ABN , First Publish Date - 2020-10-14T09:18:19+05:30 IST

‘టీ20 కా కింగ్‌’ అంటే.. ధోనీనే అని ఎక్కువ మంది ఓట్లేశారు. ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ ‘స్పోర్ట్స్‌ ఫ్లాష్‌’ సర్వేలో టీ20 కింగ్‌ ఎవరు...

‘టీ20 కా కింగ్‌’ ధోనీ

న్యూఢిల్లీ: ‘టీ20 కా కింగ్‌’ అంటే.. ధోనీనే అని ఎక్కువ మంది ఓట్లేశారు. ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ ‘స్పోర్ట్స్‌ ఫ్లాష్‌’ సర్వేలో టీ20 కింగ్‌ ఎవరు? అంటూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ జట్లకు చెందిన 128 మంది ఆటగాళ్లపై సర్వే చేశారు. మొత్తం 12 లక్షల మంది వివిధ సోషల్‌ మీడియా వేదికలుగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా తొలి సెమీ్‌సలో యువరాజ్‌పై ధోనీ, రెండో సెమీ్‌సలో రోహిత్‌ శర్మపై విరాట్‌ కోహ్లీ నెగ్గారు. ఇక ఫైనల్లో కోహ్లీపై నెగ్గిన ధోనీ.. ‘టీ20 కా కింగ్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

Updated Date - 2020-10-14T09:18:19+05:30 IST