నిలకడగా ఆడుతున్న భారత్.. ధవన్, పాండ్యా అర్ధ సెంచరీలు

ABN , First Publish Date - 2020-11-27T21:30:44+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్

నిలకడగా ఆడుతున్న భారత్.. ధవన్, పాండ్యా అర్ధ సెంచరీలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 101 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (22), కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2), కేఎల్ రాహుల్ (12) అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే, క్రీజులో కుదురుకున్న శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా బ్యాట్ ఝళిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 26 ఓవర్లు పూర్తయ్యాయి. ధవన్ 54, పాండ్యా 55 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 24 ఓవర్లలో 193 పరుగులు అవసరం.

Read more