అరంగేట్రం అదుర్స్.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో మూడో ఆటగాడు

ABN , First Publish Date - 2020-11-03T18:10:59+05:30 IST

ఐపీఎల్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

అరంగేట్రం అదుర్స్.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో మూడో ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరాటంతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్. తనకిది తొలి ఐపీఎల్ సిరీస్ అయినా.. చక్కని బ్యాటింగ్‌లో క్రీడాభిమానుల మనసులను దోచుకున్నాడు. అంతేకాదు అరంగేట్రం సీజన్‌లోనే ఎక్కువ అర్ధసెంచరీ (5)లు.. ఎక్కువ పరుగులు (471) సాధించిన భారత అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా దేవ్‌దత్‌ నిలిచాడు. ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి అన్‌క్యాప్‌డ్‌గా నిలిచిన వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్స్(616) ముందుంటాడు. 2008 నాటి ఐపీఎల్ సిరీస్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో సూర్యకుమార్ యాదవ్(512) నిలిచాడు. 2018 నాటి సీజన్లో ఈ స్కోర్ చేశాడు. 


ఈ సీజన్‌లో మొత్తం 5 అర్ధ సెంచరీలు నమోదు చేసిన దేవ్‌దత్..  జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డిలీవర్స్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 472 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. 33.71 సగటును, 126.54 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఆటగాడు కేఎల్ రాహుల్ ఒక్కడే అత్యధిక హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 670 పరుగులు చేశాడు.   

Updated Date - 2020-11-03T18:10:59+05:30 IST