రెండో మ్యాచ్ టై!

ABN , First Publish Date - 2020-09-21T05:08:14+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా యూఏఈలో జరిగిన రెండో మ్యాచ్‌ టై అయింది. ఎంతో ఉత్కంఠభరితంగా

రెండో మ్యాచ్ టై!

దుబాయి: ఐపీఎల్‌లో భాగంగా యూఏఈలో జరిగిన రెండో మ్యాచ్‌ టై అయింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఓటమి అంచుల నుంచి పంజాబ్ బయటపడింది. అయితే చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందనగా.. వికెట్ పోగొట్టుకుంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు సూపర్ ఓవర్‌కు రెడీ అవుతున్నాయి. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్‌ చేసింది. మార్కస్ స్టొయినిస్ అద్భుత ఆటతీరుతో ఢిల్లీ జట్టు 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. అయితే టెయిలెండర్ల సహాయంతో మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. 60 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును విజయం అంచుల్లో నిలబెట్టాడు. అయితే చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అయితే చివరి బంతికి ఆ ఒక్క పరుగు చేయలేక మరో వికెట్‌ను కూడా పంజాబ్ కోల్పోవడంతో మ్యాచ్ టై అయిపోయింది. ఇప్పుడు సూపర్ ఓవర్ జరగాల్సి ఉంది. 

Updated Date - 2020-09-21T05:08:14+05:30 IST