మా మధ్య అభిప్రాయ భేదాలు లేవు: దినేశ్ కార్తీక్ భార్య

ABN , First Publish Date - 2020-05-29T23:55:10+05:30 IST

తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఫిర్యాదులు కానీ లేవని టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య,

మా మధ్య అభిప్రాయ భేదాలు లేవు: దినేశ్ కార్తీక్ భార్య

చెన్నై: తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఫిర్యాదులు కానీ లేవని టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేసింది. లాక్‌డౌన్ సమయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నట్టు పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా తాము మరింత దగ్గరయ్యామని, ఒకరి అవసరాల గురించి మరొకరం మాట్లాడుకుంటున్నామని పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా సమయం దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినట్టు తెలిపింది. నిజానికి తాము ఆటల గురించి పెద్దగా మాట్లాడుకోబోమని స్పష్టం చేసింది. నిజానికి కుటుంబంతో గడిపే అవకాశం అథ్లెట్లకు తక్కువని కానీ, లాక్‌డౌన్ తమను మరింత దగ్గర చేసిందని తెలిపింది. తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో తమ గేముల్లో మరింత రాటుదేలే అవకాశం ఏర్పడిందని దీపిక వివరించింది. నిజానికి తాము ఇంటి దగ్గర ఉంటే క్రీడల గురించి పెద్దగా చర్చ రాదని, జీవితంలోని మిగతా విషయాల గురించే ఎక్కువగా చర్చించుకుంటామని దీపిక వివరించింది. 

Updated Date - 2020-05-29T23:55:10+05:30 IST