మా డెత్‌ బౌలింగ్‌ అద్భుతం

ABN , First Publish Date - 2020-04-25T09:49:51+05:30 IST

డెత్‌ ఓవర్లలో తమ జట్టు బౌలింగ్‌ అద్భుతమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ‘మా బౌలింగ్‌ దళం పటిష్ఠమైనది....

మా డెత్‌ బౌలింగ్‌ అద్భుతం

న్యూఢిల్లీ: డెత్‌ ఓవర్లలో తమ జట్టు బౌలింగ్‌ అద్భుతమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ‘మా బౌలింగ్‌ దళం పటిష్ఠమైనది. భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ (అఫ్ఘానిస్థాన్‌) వంటి అనుభవజ్ఞులు ఆఖరి ఓవర్లలో బంతిని బాగా స్వింగ్‌, స్పిన్‌ చేసేవారు’ అని వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చెప్పాడు. ఇక, గత సీజన్‌లో బెయిర్‌స్టోతో ఓపెనింగ్‌ను గుర్తు చేసుకుంటూ ‘వికెట్ల మధ్య మేమిద్దరం పోటాపోటీగా పరిగెత్తే వాళ్లం. మా మధ్య మంచి సమన్వయం ఉంది. క్రీజులోకి అడుగుపెట్టాక ‘టచ్‌ అండ్‌ గో’ అన్నట్టు ఉండేది పరిస్థితి’ అని వార్నర్‌ తెలిపాడు.


Updated Date - 2020-04-25T09:49:51+05:30 IST