దాదా పెద్ద మనసు

ABN , First Publish Date - 2020-04-05T09:47:49+05:30 IST

కొవిడ్‌-19 ధాటికి ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నడుం బిగించాడు. ఈసందర్భంగా అతడు ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ...

దాదా పెద్ద మనసు

10 వేల మందికి అన్నదానం

కోల్‌కతా: కొవిడ్‌-19 ధాటికి ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నడుం బిగించాడు. ఈసందర్భంగా అతడు ఇస్కాన్‌ ఆధ్వర్యంలో పది వేల మందికి భోజనం అందించేందుకు సిద్ధమయ్యాడు. స్థానిక ఇస్కాన్‌ సెంటర్‌ ప్రతిరోజూ పది వేల మందికి భోజనం అందిస్తుంటుంది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో దాదా మరో పది వేల మందికి అందించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఈ సంఖ్యను 20 వేలకు పెంచనున్నట్టు ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధర్మన్‌ దాస్‌ తెలిపారు. ఇంతకుముందు రామకృష్ణ మిషన్‌కు సౌరవ్‌ 20 వేల కిలోల ధాన్యాన్ని కూడా అందించాడు. 

Updated Date - 2020-04-05T09:47:49+05:30 IST