ఫిట్‌గా ఉండేందుకు డెలివరీ బాయ్‌గా..

ABN , First Publish Date - 2020-04-26T10:04:32+05:30 IST

కరోనా ధాటికి క్రీడాకారులకు సరైన ప్రాక్టీస్‌ లేకుండా ఇంట్లోనే గడిపేస్తున్నారు. కానీ ఇటలీ ప్రొఫెషనల్‌ సైక్లిస్ట్‌ అంబెర్టో మరెంగో మాత్రం ...

ఫిట్‌గా ఉండేందుకు డెలివరీ బాయ్‌గా..

కొలెగ్నో (ఇటలీ): కరోనా ధాటికి క్రీడాకారులకు సరైన ప్రాక్టీస్‌ లేకుండా ఇంట్లోనే గడిపేస్తున్నారు. కానీ ఇటలీ ప్రొఫెషనల్‌ సైక్లిస్ట్‌ అంబెర్టో మరెంగో మాత్రం వినూత్నంగా ఆలోచించి తన ఫిట్‌నె్‌సను కాపాడుకుంటున్నాడు. దీనికోసం అతడు డెలివరీ బాయ్‌గా మారాడు. ట్యూరిన్‌ సిటీలో అతను ఉదయం నుంచే శాండ్‌విచ్‌, పిస్తా, పిజ్జా, ఐస్‌క్రీమ్‌లతో కూడిన బ్యాగ్‌ను ధరించి అచ్చు సైకిల్‌ రేస్‌లో తలపడినట్టుగానే వీధుల్లో జామ్‌ జామ్‌గా తిరిగేస్తున్నాడు. రోజుకు 30 డెలివరీలు చేస్తున్న అతడు ఓవరాల్‌గా 70 కి.మీ దూరం చుట్టేస్తున్నాడు. ఒక్కోసారి డెలివరీ కోసం మెట్లు ఎక్కాల్సి వస్తుందని, ఇది తనను మరింత ఫిట్‌గా ఉంచుతుందని ఆనందపడుతున్నాడు.

Updated Date - 2020-04-26T10:04:32+05:30 IST