అమర జవాన్లపై వివాదాస్పద ట్వీట్‌.. సీఎస్‌కే వైద్యుడి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-06-18T07:39:45+05:30 IST

లద్దాఖ్‌ ఘటనలో అసువులుబాసిన భారత జవాన్లపై ఐపీఎల్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు వైద్యుడు టి. మధు వివాదాస్పద ట్వీట్‌ చేసి సస్పెన్షన్‌కు

అమర జవాన్లపై వివాదాస్పద ట్వీట్‌.. సీఎస్‌కే వైద్యుడి సస్పెన్షన్‌

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ ఘటనలో అసువులుబాసిన భారత జవాన్లపై ఐపీఎల్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు వైద్యుడు టి. మధు వివాదాస్పద ట్వీట్‌ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ‘జవాన్ల శవపేటికలపై పీఎం కేర్స్‌ అన్న స్టిక్కర్‌ అతికిస్తారేమో! ఆసక్తి కొద్దీ ఇది అడుగుతున్నా’ అని మధు ట్వీట్‌ చేశాడు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో అతను ఆ ట్వీట్‌ తొలగించాడు. వివాదాస్పద ట్వీట్‌ చేసిన మధును తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. 

Updated Date - 2020-06-18T07:39:45+05:30 IST