టీమిండియా ఆటగాళ్లకు పది నెలలుగా జీతాలివ్వలేదట!

ABN , First Publish Date - 2020-08-03T03:32:21+05:30 IST

భారత క్రికెటర్లకు గత 10 నెలలుగా జీతాలు అందలేదట. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.

టీమిండియా ఆటగాళ్లకు పది నెలలుగా జీతాలివ్వలేదట!

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు గత 10 నెలలుగా జీతాలు అందలేదట. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ ప్రకారం, భారత క్రికెట్ బోర్డుతో ఒప్పందాలు చేసుకున్న 27మంది ఆటగాళ్లకు 2019 అక్టోబరు నుంచి పేమెంట్లు అందలేదట. ఒప్పందాలు చేసుకున్న ఆటగాళ్లకు అందాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ సొమ్ముతోపాటు రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20 మ్యాచుల ఫీజులు కూడా ఆటగాళ్లకు చెల్లించలేదని తెలుస్తోంది.

Updated Date - 2020-08-03T03:32:21+05:30 IST