ఆటగాళ్ల సెలక్షన్‌ను లైవ్‌లో ప్రసారం చేయాలి: మనోజ్ తివారి

ABN , First Publish Date - 2020-07-15T03:43:17+05:30 IST

ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో నిర్వహించే సమావేశాలను లైవ్‌లో ప్రసారం చేయాలని క్రికెటర్ మనోజ్ తివారీ ...

ఆటగాళ్ల సెలక్షన్‌ను లైవ్‌లో ప్రసారం చేయాలి: మనోజ్ తివారి

న్యూఢిల్లీ: ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో నిర్వహించే సమావేశాలను లైవ్‌లో ప్రసారం చేయాలని క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. దీనివల్ల ఏ సెలెక్టర్ ఏ ఆటగాడికి.. ఎందుకు మద్దతు పలుకుతున్నాడో అర్థమవుతుందని అన్నాడు. ‘సాధారణంగా ఎవరైనా ఆటగాడు జట్టుకు ఎంపిక కాకపోతే వెంటనే సెలెక్టర్లను ప్రశ్నిస్తాడు. తనను ఎందుకు ఎంపిక చేయలేదని అడుగుతాడు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఇతర సెలెక్టర్లపై నెపం వేసి తప్పించుకుంటారు. అందువల్ల సెలెక్షన్ ప్రక్రియను లైవ్‌లో ప్రసారం చేస్తే ప్రతి ఆటగాడికీ తాను ఎందుకు ఎంపిక కాలేదో అర్థమవుతుంది. అంతేకాకుండా సెలెక్టర్లు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందడు’ అని మనోజ్ తివారీ చెప్పాడు.


ముఖ్యంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటినా ఎంపిక కాకపోవడం ఎంతో మంది ఆటగాళ్లు నిరాశకు గురవుతారని, దానివల్ల వారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వివరించాడు. ఆటగాళ్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిబంధనను తీసుకొస్తే బాగుటుందని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-07-15T03:43:17+05:30 IST