విండీస్‌ మహిళల జట్టు కోచ్‌గా వాల్ష్‌

ABN , First Publish Date - 2020-10-03T09:06:53+05:30 IST

వెస్టిండీస్‌ మహి ళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఆ దేశ ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ (57) నియమితుడయ్యాడు. 2022 చివరివరకు

విండీస్‌ మహిళల జట్టు కోచ్‌గా వాల్ష్‌

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ మహి ళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఆ దేశ ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ (57) నియమితుడయ్యాడు. 2022 చివరివరకు పదవిలో ఉండనున్న వాల్ష్‌ వచ్చే వన్డే వరల్డ్‌కప్‌, టీ20 ప్రపంచ కప్‌లకు జట్టును సన్నద్ధం చేయనున్నాడు. గతంలో బంగ్లాదేశ్‌ పురుషుల జట్టుకు వాల్ష్‌ సహాయ కోచ్‌గా పని చేశాడు. అలాగే వెస్టిండీస్‌ పురుషుల జట్టుకు సేవలందించాడు. విండీస్‌ తరఫున టెస్టుల్లో వాల్ష్‌ (132 మ్యాచ్‌ల్లో 519) అత్యధిక వికెట్లు తీశాడు. అలాగే 205 వన్డేల్లో 227 వికెట్లు సాధించాడు. కాగా పాకిస్థాన్‌ మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌గా బెర్ముడా మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ హెంప్‌ నియమితుడయ్యాడు. ఇక్బాల్‌ ఇమామ్‌ స్థానంలో పదవిని చేపట్టనున్న హెంప్‌ బెర్ముడా తరపున 22 వన్డేలాడాడు.

Updated Date - 2020-10-03T09:06:53+05:30 IST