ఆ ఆనంద క్షణాల కోసమే ఐపీఎల్‌కు దూరం: కేన్ రిచర్డ్ సన్

ABN , First Publish Date - 2020-09-04T00:26:30+05:30 IST

తొలి బిడ్డ పుట్టబోతున్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవడం ఇష్టంలేకే ఐపీఎల్ నుంచి తాను వైదొలగినట్టు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్స్‌సన్ పేర్కొన్నాడు.

ఆ ఆనంద క్షణాల కోసమే ఐపీఎల్‌కు దూరం: కేన్ రిచర్డ్ సన్

దుబాయ్: తొలి బిడ్డ పుట్టబోతున్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవడం ఇష్టంలేకే ఐపీఎల్ నుంచి తాను వైదొలగినట్టు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్స్‌సన్ పేర్కొన్నాడు. తాను ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్‌లో పునరాగమనానికి బోల్డన్ని అవకాశాలు ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాడు. ‘‘ఐపీఎల్ వంటి తీవ్ర పోటీ ఉన్న లీగ్ నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమే’’ అని కేన్ పేర్కొన్నాడు.  ‘‘బిడ్డ పుట్టుక సమయంలో మనం ఊహించనది ఏదైనా జరగొచ్చు. ప్రస్తుత ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం కష్టం కావొచ్చు. కాబట్టి ఇంటిని విడిచి రిస్క్ చేయలేను. ఐపీఎల్ నుంచి తప్పుకోవడం బాధాకరమే. అయితే, అవకాశాలు వస్తుంటాయని మాత్రం విశ్వసిస్తా. నా మొదటి బిడ్డ పుట్టుకను చూడకుండా నేను జీవించగలనని అనుకోకండి’’ అని కేన్ స్పష్టం చేశాడు.


క్రికెట్ ఎప్పటికీ ఉంటుందని, కాకపోతే తన వరకు మాత్రం తన భార్యకు అండగా ఉండడమే ముఖ్యమని పేర్కొన్నాడు. క్రికెటర్లుగా తాము ఎన్నో విషయాలకు దూరంగా ఉంటామని,  మిగతా వాటికంటే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే సమయం వస్తుందని, ప్రస్తుతం చాలా మంది ఆ పనిచేస్తున్నారని రిచర్డ్‌సన్ వివరించాడు. 


29 ఏళ్ల రిచర్డ్‌సన్‌ను గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, తన భార్య తొలి బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ నుంచి దూరం జరిగాడు.  ఐపీఎల్‌ నుంచి రిచర్డ్ ‌సన్ తప్పుకోవడంతో ఆడం జంపాతో అతడి ఖాళీని ఆర్సీబీ భర్తీ చేసింది.

Updated Date - 2020-09-04T00:26:30+05:30 IST