కరోనా ప్రభావం ఎంత?

ABN , First Publish Date - 2020-03-23T10:02:01+05:30 IST

అథ్లెట్ల సన్నాహకాలపై కరోనా వైరస్‌ ప్రభావం ఎలాఉందో తెలియజేయాలని సభ్య దేశాలను ఐఓసీ కోరింది. ఈమేరకు పలు అంశాలతో కూడిన ప్రశ్నావళిని దేశాల ఒలింపిక్‌ ...

కరోనా ప్రభావం ఎంత?

సభ్య దేశాలకు ఐఓసీ ప్రశ్నావళి

 ప్యారిస్‌: అథ్లెట్ల సన్నాహకాలపై కరోనా వైరస్‌ ప్రభావం ఎలాఉందో తెలియజేయాలని సభ్య దేశాలను ఐఓసీ కోరింది. ఈమేరకు పలు అంశాలతో కూడిన ప్రశ్నావళిని దేశాల ఒలింపిక్‌ కమిటీలకు పంపింది. విశ్వక్రీడలను వాయిదా వేయాలని పలు దేశాల ఒలింపిక్‌ కమిటీలతోపాటు అథ్లెట్లు సైతం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఐఓసీ ఈ ప్రశ్నావళిని పంపినట్టు సమాచారం. అవి వచ్చాక ఒలింపిక్స్‌ వాయిదాపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-23T10:02:01+05:30 IST