మెకెన్రో తమ్ముడికి కరోనా
ABN , First Publish Date - 2020-04-02T09:59:24+05:30 IST
ప్రఖ్యాత టెన్నిస్ వ్యాఖ్యాత, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ డబుల్స్ విజేత ప్యాట్రిక్ మెకెన్రోకి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
న్యూయార్క్: ప్రఖ్యాత టెన్నిస్ వ్యాఖ్యాత, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ డబుల్స్ విజేత ప్యాట్రిక్ మెకెన్రోకి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్యాట్రిక్ స్వయంగా ట్విటర్లో తెలిపాడు. ప్యాట్రిక్.. టెన్నిస్ లెజెండ్ జాన్ మెకెన్రో తమ్ముడు. ఈ 53 ఏళ్ల అమెరికన్ 1989లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు. 1991లో ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ చేరాడు.