ఇద్దరు ఫుట్‌బాలర్లకు కరోనా
ABN , First Publish Date - 2020-03-23T10:13:39+05:30 IST
అర్జెంటీనా స్ట్రయికర్, జువెంటస్ ఆటగాడు పౌలో డైబాల, ఏసీ మిలాన్ మాజీ డిఫెండర్ పౌలో మల్డీని కరోనా బారిన పడ్డారు. తనతోపాటు గాళ్‌ఫ్రెండ్ ఒరినా సబాని

రోమ్: అర్జెంటీనా స్ట్రయికర్, జువెంటస్ ఆటగాడు పౌలో డైబాల, ఏసీ మిలాన్ మాజీ డిఫెండర్ పౌలో మల్డీని కరోనా బారిన పడ్డారు. తనతోపాటు గాళ్‌ఫ్రెండ్ ఒరినా సబాని కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని డైబాల ట్వీట్ చేశాడు. అయితే, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపాడు. కాగా, మల్డీనీతోపాటు అతడి కుమారుడు డానియెల్‌కు కూడా వైరస్ సోకింది. వీరిద్దరూ క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నట్టు ఏసీ మిలాన్ క్లబ్ ప్రకటించింది.
కరోనాతో మాడ్రిడ్ క్లబ్ మాజీ చీఫ్ మృతి
రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లోరెంజో శాంజ్ కరోనా వైరస్‌తో మరణించాడు. 76 ఏళ్ల శాంజ్ 1995-2000 మధ్య మాడ్రిడ్ అధ్యక్షుడిగా పని చేశాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చామని.. చికిత్స పొందుతూ శాంజ్ మరణించాడని అతడి కుమారుడు చెప్పాడు.