క్రికెట్‌కు కోరె ఆండర్సన్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2020-12-06T10:12:03+05:30 IST

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోరె ఆండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొంతకాలంగా గాయాల బెడద ఎదుర్కొంటున్న 29ఏళ్ల ఆండర్సన్‌ శనివారం రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

క్రికెట్‌కు కోరె ఆండర్సన్‌ గుడ్‌బై

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోరె ఆండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొంతకాలంగా గాయాల బెడద ఎదుర్కొంటున్న 29ఏళ్ల ఆండర్సన్‌ శనివారం రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 13 టెస్ట్‌లు, 49 వన్డేలు, 31 టీ20లలో అతడు కివీ్‌సకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే యూఎస్‌ఏ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)తో మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆండర్సన్‌ వెల్లడించాడు. 2014లో వెస్టిండీ్‌సపై 36 బంతుల్లో సెంచరీ చేసిన ఆండర్సన్‌.. వన్డేల్లో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత డివిల్లీర్స్‌ ఆ రికార్డును (31 బంతుల్లో) బద్దలుగొట్టాడు.


కాబోయే భార్య కోసం..

‘కాబోయే భార్య మేరీ మార్గరెట్‌ నాకోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడామె అమెరికాలో ఉంటోంది. మేరీ కోరిక మేరకు రిటైర్మెంట్‌ తర్వాత యూఎస్‌ మేజర్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడతా’ అని ఆండర్సన్‌ తెలిపాడు. 

Read more