అతడే బెస్ట్ ఆల్‌రౌండర్.. స్టోక్స్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు

ABN , First Publish Date - 2020-07-19T00:15:28+05:30 IST

కరోనా భయాలను పక్కనపెట్టి మరీ ఇంగ్లాండ్, విండీస్ జట్లు క్రికెట్‌ను ఆరంభించేశాయి. ఈ నేపథ్యంలో..

అతడే బెస్ట్ ఆల్‌రౌండర్.. స్టోక్స్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా భయాలను పక్కనపెట్టి మరీ ఇంగ్లాండ్, విండీస్ జట్లు క్రికెట్‌ను ఆరంభించేశాయి. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్‌పైనే అందరి దృష్టి నెలకొంది. దానికి తోడు తొలి మ్యాచ్‌కు అతడే కెప్టెన్ కావడంతో ఇంకా ఉత్కంఠ పెరిగింది. అయితే కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ రాణించినా మ్యాచ్‌లో మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం స్టోక్స్ బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటాడు. ఏకంగా 150 పైగా పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇలాంటి తరుణంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్టోక్స్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో బెన్‌స్టోక్సే  నెంబర్ వన్ ఆల్‌రౌండర్ అని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.


‘టెస్టుల్లో స్టోక్స్ బ్యాటింగ్ సగటు 43. గత రెండేళ్లుగా వన్‌డేల్లో సగటు 59. బౌలింగ్‌లోనూ అతడి సగటు చాలా గొప్పగా ఉంది. ఇక నిన్నటి ఆటతో స్టోక్స్ తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటాడం’టూ బెన్‌స్టోక్స్‌ను ఆకాశ్ చోప్రా ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా స్టోక్స్ రాణించాలని ఆకాంక్షించాడు.

Updated Date - 2020-07-19T00:15:28+05:30 IST