తర్వాత నేనేనా?

ABN , First Publish Date - 2020-05-31T09:05:56+05:30 IST

నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయడ్‌ మరణంపై అమెరికా టెన్నిస్‌ సంచలనం కొకో గాఫ్‌ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. ‘పోలీసు’ హత్యకు వ్యతిరేకంగా ...

తర్వాత నేనేనా?

నల్లజాతీయుడి మరణంపై టెన్నిస్‌ తార గాఫ్‌ గళం

న్యూఢిల్లీ: నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయడ్‌ మరణంపై అమెరికా టెన్నిస్‌ సంచలనం కొకో గాఫ్‌ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. ‘పోలీసు’ హత్యకు వ్యతిరేకంగా 16 ఏళ్ల గాఫ్‌ నిరసన గళాన్ని వినిపించింది. బహిరంగంగా రోడ్డుపై ఓ పోలీసు.. నిరాయుధుడైన జార్జ్‌ మెడపై మోకాలితో తొక్కడంతో అతడు ఊపిరాడక మరణించాడు. దీనిపై అమెరికాలో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ సందర్భంగా కొకొ తన ఆవేదనను టిక్‌టాక్‌ వీడియోలో షేర్‌ చేసింది. ‘తర్వాత నేనేనా?’ అనే క్యాప్షన్‌తో ప్రశ్నించింది. ఇటీవల పోలీసుల చేతిలో మరణించిన నల్లజాతీయుల ఫొటోలతోపాటు.. ఆఖర్లో తాను నెమ్మదిగా చేతులెత్తుతూ కనిపిస్తున్న వీడియోను కొకో పోస్ట్‌ చేసింది. 

Updated Date - 2020-05-31T09:05:56+05:30 IST