2021లోనూ చెన్నై కెప్టెన్ మహీనే
ABN , First Publish Date - 2020-10-28T09:15:34+05:30 IST
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాళ్లంతా విఫలమవతుండడంతో ఆ జట్టు ఈసారి ఐపీఎల్లో

చెన్నై: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాళ్లంతా విఫలమవతుండడంతో ఆ జట్టు ఈసారి ఐపీఎల్లో అందరికంటే ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. జట్టు పరాజయాలకు ధోనీ సారథ్యం, వ్యక్తిగత ప్రదర్శనే కారణమంటూ విమర్శలు వెలువెత్తుతున్న తరుణంలో సీఎ్సకే యాజమాన్యం అతడికి అండగా నిలిచింది. మరో ఆరు నెలల్లో ప్రారంభమయ్యే 2021 ఐపీఎల్లో కూడా సీఎ్సకేను నడిపించేది ధోనీనే అని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ‘ఐపీఎల్లో ధోనీ సీఎ్సకేకు మూడు టైటిళ్లు అందించాడు. లీగ్లో మేం ప్లేఆ్ఫ్సకు చేరకపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఏడాది కలిసి రాలేదనే బాధలో మేం అనాలోచిత నిర్ణయాలైతే తీసుకోం’ అని విశ్వనాథన్ చెప్పాడు.