రాయుడు మరో మ్యాచ్‌కు దూరం

ABN , First Publish Date - 2020-09-24T09:11:43+05:30 IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు గట్టిదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మన్‌

రాయుడు మరో మ్యాచ్‌కు దూరం

దుబాయ్‌: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు గట్టిదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడికి తొడ కండర గాయమైంది. దీంతో అతడు ఢిల్లీతో శుక్రవారం జరిగే మ్యాచ్‌కి కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సీఎ్‌సకే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ చెప్పారు. ముంబైపై రాయుడు (48 బంతుల్లో 71 పరుగులు) అర్ధ శతకంతో రాణించడంతో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు రాయుడు ఫిట్‌గా లేకపోవడంతో అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను తుది జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-09-24T09:11:43+05:30 IST