వెంటిలేటర్‌పై చౌహాన్‌

ABN , First Publish Date - 2020-08-16T09:31:15+05:30 IST

భారత జట్టు మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ మృత్యువుతో పోరాడుతున్నాడు.

వెంటిలేటర్‌పై చౌహాన్‌

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ మృత్యువుతో పోరాడుతున్నాడు. గతనెల 12న అతడు కరోనా బారినపడగా..లఖ్‌నవ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే చౌహాన్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా ఇతర సమస్యలు తలెత్తడంతో గుర్‌గ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. యూపీ కేబినెట్‌ మంత్రి కూడా అయిన 73 ఏళ్ల చౌహాన్‌ కీలక శరీర అవయవాలన్నీ ప్రస్తుతం పని చేయడంలేదు. దాంతో అతడికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీ క్రికెట్‌ వర్గాలు శనివారం వెల్లడించాయి. 

Updated Date - 2020-08-16T09:31:15+05:30 IST