విరాట్‌కు ఫెడెక్స్‌ సవాల్‌

ABN , First Publish Date - 2020-04-08T09:08:41+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన స్విస్‌ టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్‌ ఫెడరర్‌.. విరాట్‌ కోహ్లీ సహా అనేక మంది సెలెబ్రిటీలకు ఓ సరదా చాలెంజ్‌ విసిరాడు. ఒక్కడే టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని కొడుతూ సోలో డ్రిల్‌ చేస్తున్న వీడియోను

విరాట్‌కు ఫెడెక్స్‌ సవాల్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన స్విస్‌ టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్‌ ఫెడరర్‌.. విరాట్‌ కోహ్లీ సహా అనేక మంది సెలెబ్రిటీలకు ఓ  సరదా చాలెంజ్‌ విసిరాడు. ఒక్కడే టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని కొడుతూ సోలో డ్రిల్‌ చేస్తున్న వీడియోను ఫెడరర్‌ పోస్ట్‌ చేశాడు. ‘అందరికీ ఉపయోగకరమైన సోలో డ్రిల్‌. మీరెలా చేస్తారో వీడియోతో రిప్లై ఇవ్వండి’ అని ట్వీట్‌ చేశాడు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా కోహ్లీతో సహా అనేక మందిని ఫెడరర్‌ నామినేట్‌ చేశాడు.

Updated Date - 2020-04-08T09:08:41+05:30 IST