కోహ్లీ.. నీ స్థానం కోల్పోతానని భయపడుతున్నావా: చాహల్
ABN , First Publish Date - 2020-05-14T00:34:08+05:30 IST
టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ చాలా సరదాగా ఉంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతను తన సోషల్‌మీడియాలో పలు

ముంబై: టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ చాలా సరదాగా ఉంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతను తన సోషల్‌మీడియాలో పలు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తూ.. అభిమానులను ఇంటి నుంచే అలరిస్తున్నాడు.
అయితే చాహల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. 2008-09 కూచ్ బెహర్ ట్రోఫీలో చాహల్ సెంచరీ చేసిన విషయాన్ని ఆర్‌సీబీ గుర్తు చేసింది. హిమాచల్‌ప్రదేశ్ అండర్-19 జట్టుపై చాహల్ 135, 46 పరుగులు చేశాడని పేర్కొంది. ఆ సీజన్‌లో బ్యాట్‌తో మెరిసిన చహల్.. మొత్తం 281 పరుగులు చేశాడని, అతడి బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు జరపాల్సిందేనని పేర్కొంది.
అయితే ఈ పోస్ట్‌పై చాహల్ తన స్టైల్‌లో స్పందించాడు. ‘‘కోహ్లీ భయ్యా.. నీ నెం.3 స్థానం కోల్పోతావేమో అని భయపడుతున్నావా’’ అని చాహల్ కామెంట్ చేశాడు. అయితే చాహల్‌కి కోహ్లీ చురక అంటించాడు. ‘‘అవును అది కేవలం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అయితేనే’’ అంటూ కోహ్లీ కామెంట్ చేశాడు.