కత్రినా కైఫ్ లైవ్ ఛాట్‌లోకి ఎంటరైన చాహల్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2020-05-12T02:38:37+05:30 IST

టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ చాలా సరదాగా ఉంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతను తన సోషల్‌మీడియాలో పలు

కత్రినా కైఫ్ లైవ్ ఛాట్‌లోకి ఎంటరైన చాహల్.. ఎందుకంటే..

ముంబై: టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ చాలా సరదాగా ఉంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతను తన సోషల్‌మీడియాలో పలు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తూ.. అభిమానులను ఇంటి నుంచే అలరిస్తున్నాడు. 


తోటి క్రికెటర్లతో సోషల్‌మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్న చాహల్.. సడెన్‌గా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఛాట్‌లోకి ఎంటర్ అయ్యాడు. కత్రినాకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. బహుశా.. చాహల్‌ కూడా అందులో ఒకడు కావొచ్చు. అందుకే కత్రినా లైవ్ ఛాట్ నిర్వహిస్తున్న సమయంలో అతను ‘హాయ్ కత్రినా మ్యామ్’ అంటూ కామెంట్ చేశాడు. కానీ, పాపం అతని కామెంట్‌కి కత్రినా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం చాహల్ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.Updated Date - 2020-05-12T02:38:37+05:30 IST