బ్యాట్‌ మరమ్మతులో కోహ్లీ..

ABN , First Publish Date - 2020-09-12T09:04:21+05:30 IST

ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం వేచి చూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈసారి పకడ్బందీగా ...

బ్యాట్‌ మరమ్మతులో కోహ్లీ..

దుబాయ్‌: ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం వేచి చూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈసారి పకడ్బందీగా సిద్ధమవుతున్నట్టున్నాడు. దీంట్లో భాగంగా తన బ్యాట్లను మరింత శక్తివంతంగా ఉంచేందుకు తగిన రిపేర్లను కూడా చేస్తున్నాడు. ఈమేరకు సోషల్‌ మీడియాలో చిన్న వీడియోను పోస్ట్‌ చేశాడు. దాంట్లో ఓ చిన్న రంపం పట్టుకుని బ్యాట్‌ హ్యాండిల్‌ను కొద్ది మేర కట్‌ చేస్తూ కనిపించాడు. ‘బ్యాట్‌ బ్యాలెన్స్‌ సరిగ్గా ఉండేందుకు 1-2 సెంటీమీటర్లయినా కీలకమే. నా బ్యాట్లను జాగ్రత్తగా చూసుకోవడమంటే నాకెంతో ఇష్టం’ అని ట్వీట్‌ చేశాడు. మరోవైపు కోహ్లీ బ్యాట్‌ రిపేరింగ్‌ను చూసిన హార్దిక్‌ పాండ్యా తెగ ముచ్చటపడ్డాడు. తన బ్యాట్లను కూడా అదే విధంగా మరమ్మతు చేయాలంటూ కోహ్లీని సరదాగా కోరాడు. 

Updated Date - 2020-09-12T09:04:21+05:30 IST