సారథ్యం.. అమోఘం!

ABN , First Publish Date - 2020-12-30T07:12:23+05:30 IST

రహానె సెంచరీతో పాటు సారథ్యం కూడా భారత్‌కు కలిసొస్తుందా..? ఏమో.. ఇప్పటిదాకా అతను కెప్టెన్‌గా వ్యవహరించిన మూడుసార్లూ భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు గెలవడం విశేషం.

సారథ్యం.. అమోఘం!

రహానె సెంచరీతో పాటు సారథ్యం కూడా భారత్‌కు కలిసొస్తుందా..? ఏమో.. ఇప్పటిదాకా అతను కెప్టెన్‌గా వ్యవహరించిన మూడుసార్లూ భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు గెలవడం విశేషం. 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన సందర్భంగా రహానెకు తొలిసారి టెస్ట్‌ జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశం లభించింది. 4 టెస్ట్‌ల ఆ సిరీ్‌సలో ధర్మశాలలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీ గైర్హాజరీలో పగ్గాలు స్వీకరించిన రహానె.. తనదైన నాయకత్వ పటిమతో ఆ మ్యాచ్‌ను గెలిపించాడు. ఇక 2018లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌కు కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రహానె సారథ్యం వహించాడు. ఆ టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 262 రన్స్‌తో గెలిచింది.


శతక్కొడితే..అంతే!

‘అజింక్యా రహానె శతక్కొడితే.. భారత్‌కు విజయమే’. అవును..అతడి గణాంకాలు చూస్తే నిజమేననిపించక మానదు. రహానె ఇప్పటిదాకా 12 టెస్ట్‌ సెంచరీలు సాధించాడు. వీటిలో ఏ మ్యాచ్‌లోనూ భారత్‌ ఓడిపోలేదు. తొమ్మిదింటిలో గెలవగా.. మూడు టెస్ట్‌లు డ్రాగా ముగిశాయి. ఇక.. అతను వన్డేల్లో శతకాలు కొట్టిన మూడు పర్యాయాలూ భారత్‌ గెలుపొందింది.


Read more